లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ నియమితులయ్యారు.
సత్తెనపల్లి త్యాగరాజు మందిరంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చందోలు సత్య నారాయణ ఈ నియామకం చేపట్టారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర అధ్యక్షుడు చందోలు సత్యనారాయణ కృషి చేస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు.