పల్నాడు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ కోరారు. శుక్రవారం సత్తెనపల్లి సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 6, 7, 8 తేదీలలో నరసరావుపేట షాదీ ఖానాలో సీపీఎం 25వ జిల్లా మహాసభలు జరుగుతాయన్నారు. కార్మిక, రైతు, విద్యార్థి, మహిళ, యువత ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.