సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామం వద్ద లారీ టైరు కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఉదయం మొక్కజొన్న విత్తనాల లోడ్ కోసం వెళ్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామానికి చెందిన షేక్ చిన్న మస్తాన్ వలిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.