పల్నాడు జిల్లా సత్తెనపల్లి రఘురాం నగర్ ప్రజా వేదికనందు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 31 లక్షల 01వేల 938 రూపాయల చెక్కులను శనివారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర సమస్యలు ఏమి ఉన్నా సత్తెనపల్లి మై టిడిపి యాప్ లో అప్లోడ్ చేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.