నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు, టీడీపీ రాజకీయ హత్య అని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వారంలోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసిపి పోరాడుతుందన్నారు.