సత్తెనపల్లి: అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ప్రత్యేక పూజలు

78చూసినవారు
నకరికల్లు మండలం నరసింగపాడులోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జేష్ఠ మాసం, పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం అర్చకుడు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. పలువురు భక్తులు,దంపతులు పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్