సత్తెనపల్లి: విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడి

51చూసినవారు
సత్తెనపల్లిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో పట్టణంలోని వంట నూనెలు, ఆయిల్ షాపులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బొంతవారి వీధిలో విజయలక్ష్మి ఆయిల్ స్టోర్ లో ఆయిల్ శాంపిల్స్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా వంట నూనె విక్రయిస్తున్న ఆయిల్ షాపులో శాంపిల్స్ టిన్స్ ను అధికారులు ల్యాబ్ కు పంపించారు. కల్తీ నూనె అని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ సీఐ శివాజీ అన్నారు.

సంబంధిత పోస్ట్