తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా గురువారం సత్తెనపల్లి యువతి ఎంపికయ్యారు. సత్తెనపల్లికి చెందిన షేక్ రోషన్ విశాఖలోని ఓయూనివర్సిటీలో లా విద్యను 2023లో పూర్తి చేసి, ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2024లో జూనియర్ సివిల్ జడ్జ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకొని వివిధ దశల్లో జరిగిన ప్రక్రియలో విజయం సాధించారు. యువతీ తల్లిదండ్రులతో పాటు సత్తెనపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.