సత్తెనపల్లిలోని వేద నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని జ్వరం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికుల వివరాల ప్రకారం. ఏఎన్ మ్ కోర్సు మొదటి సంవత్సరం చదివే కీర్తన శనివారం జ్వరం మాత్రలు మింగగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక సత్తెనపల్లిలో చికిత్స పొందుతుంది. సత్తెనపల్లిలోని బాలికల ఎస్సీ హాస్టల్లో నివాసం ఉంటూ కళాశాలలో చదువుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.