సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో తిరునాళ్ల జరుగుతున్న నేపథ్యంలో తిరునాళ్ళ తిలకించడానికి వచ్చిన ఫణిదం గ్రామానికి చెందిన విప్పర్ల చరణ్ తేజ, విప్పర్ల సురేష్ లకు, జనసేన పార్టీకి చెందిన యువతకు శనివారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. దీనితో సురేష్, తేజ పై బీరు సీసాతో దాడి చేశారు. ఈ దాడిలో ఇరువురికి గాయాలయ్యాయి. బాధితులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.