అమరావతి నిర్మాణం భూములను ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 ఏళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణను తప్పించుకునేందుకు పనులు ప్రారంభించి కొంత మేర కంప తొలగించింది. కనుచూపు మేర ప్లాట్లలో విపరీతంగా కంప చెట్లు పెరిగిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు.