ఫిరంగిపురం: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

57చూసినవారు
ఫిరంగిపురం: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలోని పొలాల్లో కొంతమంది పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ. 15, 090 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుల సమయంలో బాధితులను పట్టుకునేందుకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని అధికారులు తెలిపారు. దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్