కాకుమాను మండలం కొమ్మూరు సమీపంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెదనందిపాడు గ్రామాల రైతులు పండించిన మొక్కజొన్న పంట మంటలకు ఆహుతయింది. మంటలు వేగంగా విస్తరించి విపరీత నష్టం కలిగించాయి. అధికారులు ఆలస్యంగా చేరడం వల్ల రైతులకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. వెంటనే స్పందించి సహాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.