సీజనల్ వ్యాధుల నియంత్రణకు రూ. 50 కోట్లతో ప్రత్యేక డ్రైవ్

69చూసినవారు
వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వెలగపూడిలో సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. దాదాపు రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్