గుంటూరు నగరంలో శంకర విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల మళ్లింపుల కొరకు ట్రాఫిక్ పోలీసు వారు చేసిన ట్రాఫిక్ మళ్లింపులను స్వయంగా గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వాహన రద్దీ ఎక్కువ ఉండే రహదారుల వద్ద ట్రాఫిక్ మళ్లింపుటకు తగినంత సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ప్రజలు మరియు వాహందారులు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ వారికి సహకరించాలని ఆయన కోరారు.