గుంటూరు జిల్లా క్రికెట్ జట్టు (అండర్-19) ఎంపిక కోసం ఈనెల 17న ట్రయల్స్ నిర్వహించనున్నట్లు త్రీమెన్ కమిటీ సభ్యుడు మహతి శంకర్ గురువారం తెలిపారు. ట్రయల్స్ అరండల్పేట పిచ్చుకులగుంట మైదానంలో ఉదయం 7. 30 గంటలకు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 1, 2006 తర్వాత జన్మించినవారు మాత్రమే అర్హులు. ఆటగాళ్లు వైట్ డ్రెస్, సొంత కిట్, వయస్సు ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. వివరాలకు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను సంప్రదించవచ్చు.