గుంటూరు జిల్లా డీపీఓ నాగసాయికుమార్ చెత్త నుంచి సంపద సృష్టించడంపై దృష్టి సారించాలని సూచించారు. పెదకాకానిలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న డీపీఓ, 10 వేలకు పైగా జనాభా ఉన్న 10 గ్రామాలను ఎంపిక చేసి ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా పెదకాకాని, నంబూరు గ్రామాలు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.