గత 10 ఏళ్లుగా సాగిన పోరాటానికి ఫలితంగా జీవో నం. 519 విడుదలైందని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని, సీఎం చంద్రబాబు నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 9 జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.