గుంటూరు ప్రముఖ రంగస్థల నటులు కావూరు సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కళా రత్న అవార్డు అందించడం పట్ల వార్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను సోమవారం సత్కరించింది. ఈ కార్యక్రమం అరండల్ పేటలోని పుండరీ కాక్షయ్య పార్క్, వాకర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సత్కార వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళా రత్న అవార్డు పొందిన సత్యనారాయణకు పట్టు వస్త్రాలు, శాలువాతో సత్కారం చేశారు.