
'మహిళ' అంటే అసలైన అర్థం చెప్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
యూకే సుప్రీంకోర్టు 'మహిళ' అనేదానిపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. స్కాట్లాండ్ ప్రభుత్వం వర్సెస్ ఓ మహిళా గ్రూప్ కేసులో పుట్టుకతో అమ్మాయిలుగా ఉన్న వారినే చట్టపరంగా "మహిళలు"గా గుర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. 2010 సమానత్వ చట్టం ప్రకారం 'స్త్రీ' అనే పదం పుట్టుకతో లింగాన్ని సూచిస్తుందని పేర్కొంది. లింగ మార్పిడి చేసిన వారికి లింగ గుర్తింపు సర్టిఫికెట్ ఉన్నా, వారిని చట్టపరంగా మహిళలుగా పరిగణించలేమంది.