మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ చంద్రబాబు నాటిన విత్తనం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దానికి లోకేశ్ నీళ్లు పోసి పెంచారని పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి కిరణ్ వైయస్ఆర్సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు.