గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామానికి చెందిన మీరాబ్ధికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును బుధవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అందజేశారు. ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీరాబ్ధికి ప్రభుత్వం ఈ సహాయాన్ని అందించిందని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.