తాడికొండ నియోజకవర్గ పరిధిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో మంత్రి నారాయణ మంగళవారం పర్యటించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ లభ్యత, మైనింగ్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. మంత్రి వెంట మైనింగ్ స్పెషల్ డీడీ నాగిని, ఎమ్మార్వో సుజాత, ఇతర అధికారులు ఉన్నారు.