ప్రవీణ్‌ పగడాల కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి: విజయ్‌కుమార్‌

72చూసినవారు
ప్రవీణ్‌ పగడాల కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి: విజయ్‌కుమార్‌
ప్రవీణ్‌ పగడాల మృతిపై ఐజీ అశోక్‌కుమార్‌ చేసిన దర్యాప్తుపై అనేక అనుమానాలున్నాయని, కేసును రీ ఓపెన్‌ చేసి మళ్లీ దర్యాప్తు చేయాలని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆదివారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్‌ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, పోలీసుల కథనాల్లో పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నిజ నిర్ధారణ కోసం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్