కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని తెలిపారు. ఈ వివాదాస్పద చట్టాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆమోదించాయని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, వక్ఫ్ చట్టానికి టీడీపీ, జనసేన మద్దతే కారణమన్నారు. ముస్లింల ఆందోళనలపై టీడీపీ పాల్గొనడం దుర్మార్గమని విమర్శించారు.