బాబు జగజ్జివన్ రామ్ వర్ధంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పలువురు నేతలు ఆదివారం నాడు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళు లాగా జగజీవన్ రామ్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేశారని అన్నారు. దళితులుగా పుట్టాలి అని ఎవరి కోరుకుంటారు అని గతంలో అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారి ఫోటోలకు దండలు వేసే అర్హత ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.