చంద్రబాబు పర్యటనలు సినిమాలు తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. దళితులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయం మీడియా సమావేశంలో మంగళవారం తెలియజేశారు. వైఎస్ జగన్ దళితుల మేలు కోసం అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు. తన భార్యని కాలితో తన్నారని, తమ కుటుంబంపై దాడి చేశారని, త్వరలో ఆ వీడియోలు విడుదల చేస్తానన్నారు. దళితులు ఈ నేతలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.