తాడేపల్లి: హామీలు అమలు చేయలేక మత ముద్ర విధిస్తోన్న కూటమి

79చూసినవారు
తాడేపల్లి: హామీలు అమలు చేయలేక మత ముద్ర విధిస్తోన్న కూటమి
వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు బుధవారం తాడేపల్లిలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక మతం ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని విమర్శించారు. తిరుమలలో గతంలో తాంత్రిక పూజలు, ఆలయాల కూల్చివేతలు టీడీపీ హయాంలో జరిగాయని గుర్తుచేశారు. జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారని, చంద్రబాబు హయాంలోనే దాడులు జరిగాయని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్