రాజకీయాల్లో డ్రామాలు ఆడాలంటే చంద్రబాబును మించినవారు లేరంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే వైఎస్ జగన్ మీద విమర్శలా? చంద్రబాబు సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు