తాడికొండ: బిఎల్డీఓల సమావేశం.. ఓటర్ల జాబితా వివరాలపై చర్చ

54చూసినవారు
తాడికొండ: బిఎల్డీఓల సమావేశం.. ఓటర్ల జాబితా వివరాలపై చర్చ
తాడికొండలో బిఎల్డీఓల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎన్నికల అధికారి గంగరాజు హాజరయ్యారు. సమావేశంలో ఆయన బిఎల్డీలతో మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై వివరణ ఇచ్చారు. అలాగే ఓటర్ల జాబితాలో వికలాంగుల వివరాలు, నివాసాల మార్పులు, డోర్ నంబర్ నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే వారి వివరాలు సరైన డోర్ నంబర్‌తో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల సూపర్వైజర్లు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

సంబంధిత పోస్ట్