తాడికొండ తహశీల్దార్ కార్యాలయంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఈఆర్ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎలక్షన్ ఆపరేటర్లు హాజరయ్యారు. ఎన్నికల అధికారి రాజు రాజకీయ పార్టీల ప్రముఖులతో ఎన్నికల నిర్వహణపై పలు అంశాలను చర్చించారు. రాజకీయ నాయకుల సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నారు.