తాడికొండ: గ్రామ సభలో రైతుల నోట పుష్ప సినిమా డైలాగ్

10చూసినవారు
రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం నాడు పలు గ్రామాలలో గ్రామసభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిడుముక్కలలో భూ సమీకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో రప్పా. రప్పా డైలాగ్ ఓ రైతు లేవనెత్తాడు. మా భూములు ఇస్తాం మళ్లీ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏమిటో చెప్పాలి అంటూ రైతు ప్రశ్నించాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రప్పా. రప్పా అని మాట్లాడాడని, ఇప్పుడు భూమి ఇస్తాను తర్వాత TDP ప్రభుత్వం రాకపోతే నా పని రప్పా. రప్పా ఏగా అని వాపోయాడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే తాడికొండలో కూడా ఓడిపోతుందని మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్