తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. శివాలయం ఎదురుగా ఉన్న ఆర్&బి రోడ్ నుంచి ఓబురాయి చెరువు వరకు కాలువ విస్తరణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.