నల్లపాడు టిడ్కో గృహంలో 17 ఏళ్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ నగ్మా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫలితాల్లో ఆమెకు 780 మార్కులు వచ్చాయి. అయితే ఆమె మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఆ ఫలితాల్లో తాను ఆశించిన మేరకు మార్కులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఆమె మృతదేహం కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.