ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, వివాదాలకు త్వరలో పరిష్కారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సినీ పెద్దలు ఈ నెల 15న సా.4 గంటలకు సీఎం చంద్రబాబును అమరావతిలో కలవనున్నారు. వారు అపాయింట్మెంట్ కోరగా, సీఎం కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భేటీ కంటే ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సమావేశం కానున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలపై చర్చించనున్నారు.