వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మస్తాన్ వలి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, అనుబంధ విభాగాల కమిటీల నియామకం సభ్యునిగా ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.