తుళ్లూరు: గుడికి వెళ్తున్న ఆటోను ఢీ కొట్టిన కారు

8చూసినవారు
తుళ్లూరు మండలంలోని మందడం సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా వెంకటపాలెం టీటీడీ ఆలయం నుంచి వస్తున్న కారు, ఎదురుగా వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్