తుళ్లూరు మండలంలోని లైబ్రరీ సెంటర్లో డ్రైనేజీ పాడైపోయి మురుగునీరు నిలువ ఉండి దుర్గంధం వస్తూ ఉండటంతో స్థానికులు పలుమార్లు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే డ్రైనేజీ మరమ్మతులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం డ్రైనేజీ మరమ్మతు పనులు నిర్వహించారు. దీనిపై గ్రామస్తులు హర్షం ప్రకటించారు.