వైసీపీ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేష్ ను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేష్ వెళ్లారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 లో జరిగిన మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ 78వ నిందితుడిగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.