తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో కొలువైన వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గురువారం జరిగిన అన్నదాన కార్య క్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు టీడీపీ నాయకుడు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు వడ్డించారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.