తెనాలి, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రుల ఆత్మీయ సమావేశం శనివారం తెనాలిలో నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచిన ఆలపాటిని గెలిపించుకుందామని మనోహర్ పిలుపునిచ్చారు.