తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానానికి ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి స్వామి వారి దర్శనం కోసం వేచిచూశారు. శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించారు.