తెనాలిలో వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలన క్యాంప్‌

59చూసినవారు
తెనాలిలో వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలన క్యాంప్‌
తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గురువారం వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనకు ప్రత్యేక వైద్య క్యాంప్‌ నిర్వహించారు. ఆర్థో విభాగానికి 100 మంది, ఈఎన్‌టీకి 50 మంది, సెక్రాటిక్‌ విభాగానికి మరో 50 మంది వికలాంగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం కూడా క్యాంప్‌ కొనసాగుతుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యవాణి తెలిపారు. పునఃపరిశీలన అనంతరం అర్హులైన వారికి ధ్రువపత్రాలు జారీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్