బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే నిత్యవసర సరుకులు రైతు బజార్లలో లభిస్తున్నాయని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. గురువారం తెనాలి రైతు బజార్లో ఏర్పాటు చేసిన నిత్యవసర సరుకుల స్టాల్ ను ఆయన ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో నిత్యవసరాలు తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ధరలు తగ్గేవరకు రైతు బజార్లలో ప్రజలకు నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు.