రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కష్టకాలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. కొలకలూరులో శనివారం పల్లె పండుగలో పాల్గొని రూ. 13లక్షలతో నిర్మిస్తున్న హిందూస్మశాన వాటిక అప్రోచ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు పల్లె పండుగ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తెనాలిలో 4 కోట్లతో రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు.