గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు తెనాలి రైల్వే పోలీసులు గురువారం తెలిపారు. తెనాలి-విజయవాడ ప్రధాన మార్గంలో దుగ్గిరాల- చిలుమూరు రైల్వే స్టేషన్ లమధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఒంటిపై బనియన్, లుంగీ మాత్రమే ఉన్నాయని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.