కేరళ వాసి, అంతర్జాతీయ చిత్రకారుడు, 2 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు విజేత రాజశేఖరన్ పరమేశ్వరన్ తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని శనివారం సందర్శించారు. వేరువేరు మెటీరియల్స్ తో రూపొందించిన వందలాది శిల్పాలను తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను అభినందించారు. తెనాలి లాంటి ప్రాంతంలో ఓకే వేదికపై ఇన్ని అద్భుతమైన శిల్పాలు చూడటం సంతోషంగా ఉందన్నారు.