అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, తెనాలి పట్టణంలో మంగళవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్ళి, అక్కడ ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియా పేపర్ ను రద్దు చేయాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.