తెనాలిలో బాలికపై లైంగిక వేధింపులు

72చూసినవారు
తెనాలిలో బాలికపై లైంగిక వేధింపులు
దుగ్గిరాలికి చెందిన రవి, ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనపై రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 14న సాయంత్రం తెనాలి బుర్రిపాలెం రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న బాలికను రవి బెదిరించి, శివారు పొలాలకు తీసుకెళ్లి వేధించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు చేరుకోగా రవి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్