తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెనాలికి చెందిన సురేంద్ర మాట్లాడుతూ. ఇటీవల జరిగిన వైసీపీ కార్యకర్త మృతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమ సామాజిక వర్గాన్ని అవమానించేలా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.